Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ ఎల్. రమణ
- నియోజకవర్గ అభివద్ధికి రూ.2923 కోట్లు ఖర్చు
- బప్పర్ జోన్ అనేది ప్రభుత్వ దృష్టిలో లేదు
- పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలి
- పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలి
- ఎండోమెంట్ భూమిని ఫార్మాకు తీసుకోవడం లేదు : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం
- మండల కేంద్రంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ-యాచారం
సీఎం కేసీఆర్ దేశ రూపురేఖలు మార్చేందుకే బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ స్పష్టం చేశారు. శనివారం యాచారం మండలం కేంద్రంలో ఉన్న సాయిశరణం గార్డెన్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం మండల కేంద్రంలో దాదాపు వందలాది మంది కార్యకర్తలతో బీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్. రమణ హాజరె,ౖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ ప్రచారం చేస్తూ కార్యకర్తలందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. గతంలో జరిగిన మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రగతి నివేదన యాత్ర పార్టీ అభివృద్ధికి తోడ్పాటునందించిందని గుర్తు చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పాగా వేయడానికి ప్రతీ కార్యకర్తా సైనికుడిలా పని చేయాలన్నారు. కేంద్రంలో అధికారాల్లో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాలపై పెత్తనం చెలాయిం చేందుకు ఈడీ ని వాడుకుంటుందని ధ్వజమెత్తారు.
ఎండోమెంట్ భూమిని ఫార్మాకు తీసుకోబోం : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
మండల పరిధిలోని తాడిపర్తి, సింగారం, నంది వనపర్తి, కుర్మిద్ధ గ్రామాల్లో ఉన్న ఎండో మెంట్ భూములను ప్రభుత్వం ఫార్మాకు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హామీనిచ్చారు. బప్పర్ జోన్ పై వదం తులు నమ్ముతున్నారు. ఈ విషయంపై ప్రతి పక్షాల నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి రూ.2923 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తన పైన అబండాలు మోపుతున్నారని విమర్శించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని కోరారు. చేసిన అభివృద్ధిని, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు వందేటి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ సత్తు వెంకటరమణ రెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి పాశ్చ భాషా, పీఎసీఎస్ చైర్మన్ తోటి రెడ్డి రాజేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ కారింగ్ యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తలారి మల్లేష్, కాయితే వెంకట్ రెడ్డి, నేనావత్ శంకర్‌నాయక్, ఆడాల గణేష్, సర్పంచులు ఉదయశ్రీ, హబీబుద్దిన్, కృష్ణ మాదిగ, సంతోష, ఇందిరా, విజయలక్ష్మి, ఎంపీటీసీలు శివ లీల, శారద, సహకార సంఘం డైరెక్టర్లు స్వరూప, శశికళ, నంది వనపర్తి మాజీ సర్పంచ్ రాజు నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.