Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం పూట పని కల్పించాలి
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య
నవతెలంగాణ-యాచారం
ఉపాధి హామీ చట్టంలో పనిచేసే కూలీలకు రెండుసార్లు ఫొటోలు తీసే పద్ధతిని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి. అంజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం యాచారం మండల పరిధిలోని మోగుల్లవంపులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ప్రస్తుత ఎండాకాలంలో ఉపాధి హామీ కింద ఉదయం పూట పనులను చేయించాలని అధికారులను కోరారు. కూలీలకు అవసరమైన పనిముట్లను ప్రభుత్వమే సమకూర్చాలని తెలిపారు. పనిచేసిన ఉపాధ్యాయుని డబ్బులను కూలీల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని చెప్పారు. పనిచేసే చోట కూలీలకు కావాల్సిన నీడ, తాగునీరు, మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. మెట్లకు పారితోషకం పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు పుష్ప, మంజుల తదితరులు పాల్గొన్నారు.