Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండలాధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి
మండలం 8న జరిగే యువ సంఘర్షణ నిరుద్యోగ నిరసన బహిరంగ సభకు రావాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం మం డల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. 8వతేదీ తెలంగా ణ నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కా ర్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించే యువ సంఘర్షణ నిరుద్యోగ నిరసన బహిరంగసభకు ప్రజలు నిరుద్యోగులు, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పోరాడి విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెెలంగాణ దొరలపాలు కావడంతో రాష్ట్రం అవినీతిమ యంలో కూరుకుందన్నారు. 9 ఏండ్ల నుండి నిరుద్యోగు లను మోసం చేస్తూ పబ్బం గడిపిన కెేసీఆర్ ప్రభుత్వానికి త్వరలోనే చరమగీతం పాడి గద్దెదించబోతున్నారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు మో హన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అంజయ్య గుప్తా, మా జీ ఎంపీటీసీ రాములు, పెద్దూరు సర్పంచ్ శ్రీశైలం, అసెం బ్లీ సోషల్ మీడియా ఇన్చార్జ్ అజీమ్, కాంగ్రెస్ నాయకులు గుజ్జుల మహేష్, మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విష్ణు గౌడ్, మైనారిటీ మండల అధ్యక్షుడు ఆరిఫ్, యూత్ కాం గ్రెస్ నాయకులు నిర్దవెళ్లి తిరుపతి, నాయకులు సుదర్శన్ రెడ్డి, పబ్బతి వెంకటయ్య, మాజీఉపసర్పంచ్ చెన్నకేశవులు, ఎన్ఎస్యుఐ మండలాధ్యక్షుడు రమేష్, వార్డు మెంబర్ శ్రీను నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు నరేష్ ,శివ ,సాయినాథ్ తదితరులున్నారు.