Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
పంచాయతీ కార్యదర్శు ల ప్రొబెషన్ కాలం ము గిసి నందున జూనియర్ పంచా యతీ కార్యదర్శులను రెగ్యుల రైజ్ చేసి వారి న్యాయమైన డిమాండ్లపై సాను కూలంగా స్పందించి రెగ్యులర్ చేయా లని సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షులు బుసచంద్రయ్య డిమాండ్ చేశారు. కొడంగల్‌లోని 9 రోజులుగా చేస్తున్న ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీఐటీయూగా డిమాం డ్ చేస్తున్నామన్నారు. రెగ్యులరైజ్ చేస్తూ వెంటనే జీవోను విడుదల చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని, గడిచిన 4 ఏండ్ల ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించి ప్ర స్తుతం పనిచేస్తున్న ఔట్‌సోర్సిం గ్ పంచాయతీ కార్యదర్శులు అందర్నీ జిపిఎస్లుగా ప్రమోట్ చేస్తూ క్రమబద్ధీక రించాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు అశోక్, ఆనం దం, రాధా, కృష్ణవేణి, కృష్ణయ్య, రమేష్ రా థోడ్, సోనీ, నక్షత్ర, రవికుమార్, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.