Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
ఈనెల 8న నగరంలోని సరూర్నగర్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న ప్రియాంక గాంధీ యూత్ ఘర్షణ బహిరంగ సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం నార్సింగ్ మున్సిపాలిటీలో ముఖ్య కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మండల అధ్యక్షులు శాతం అశోక్ యా దవ్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి 5000 మందిని కార్యకర్తలను తరలించాలన్నారు. కార్యక్రమంలో గండిపేట్, శంషాబాద్ అధ్య క్షులు అశోక్ యాదవ్, గడ్డం శేఖర్ యాదవ్ ,ఏ బ్లాక్ అధ్యక్షులు నవీన్ కుమా ర్, దుడ్డు కిరణ్ కుమార్ కృష్ణారెడ్డి, జితేందర్, బాలరాజ్ ,ధనంజరు, కౌన్సిల ర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.