Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యు లరైజ్ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని పరిగి పట్టణ కేంద్రంలో తొ మ్మిది రోజులుగా చేస్తున్నా సమ్మెకు శనివారం సీపీఐ(ఎం) పరిగి మండల కమిటీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ ఎం.వెంకటయ్య మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాపితంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 2019 ఏప్రిల్ నుండి వివిధ గ్రామపం చాయతీల్లో పనిచేస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం వీరి ప్రొ బేషన్ కాలం ఏప్రిల్ 2022 కే పూర్తయిందన్నారు. అయి నా మరొక్క సంవత్సరం పెంచుతూ ప్రభుత్వం జీవో తీసు కొచ్చిందని తెలిపారు. ఈ గడువు కూడా 11 ఏప్రిల్ 20 23తో ముగుస్తున్నది. తెలంగాణలో కాంట్రాక్ట్, ఔట్సో ర్సింగ్ వ్యవస్థ ఉంకూడదన్న మీరు, వీరి నాలుగేళ్ళ ప్రొబే షన్ గడువు పూర్తయినప్పటికీ రెగ్యులరైజ్ చేయకపోవడం బాధాకరం అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ గ్రామాలకు అనేక అవా ర్డులు కూడా వీరు తీసుకొచ్చారని తెలిపారు. స్థానిక సం స్థల్లో వీరి పాత్ర చాలా కీలకమైనది. జూనియర్ పంచాయ తీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ వెంటనే జీవో ను విడుదల చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గడి చిన 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలన్ని సర్వీసు కాలంగా గుర్తించాలన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులనందరినీ జేపీఎస్లుగా ప్రమోట్ చేస్త, పని చేసిన కాలాన్ని ప్రొబేషన్ పీరియడ్లో బాగంగా పరిగణించి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. రాష్ట్ర వ్యా ప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ని నిర్ధారిం చి ప్రకటించాలన్నారు. మరణించిన జూనియర్ పంచా యతీ కార్యదర్శుల కుటుంబాల నుండి కారుణ్య నియమ కాలు చేపట్టాలని అర్హులైన సీనియర్ పంచాయతీ కార్య దర్శులకు ప్రమోషన్లు కల్పించాలన్నారు. జీవో నంబర్ 317 వల్ల నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యా యం చేయాలని పరస్పర బదిలీలు, స్పౌస్ బదిలీలకు అవ కాశం కలిపించాలని డిమాండ్ చేశారు. ఇంతటి ప్రాధాన్య త కలిగిన వీరి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి, ఏడు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిం పజేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా నా యకులు సామెల్, విగేష్, సత్యయ్య, శేఖర్ రెడ్డి, నవీన్, పాండు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.