Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెరవేరిన మండల ప్రజల కల
- రైల్ పాసులు అందరూ తీసుకోవాలి
- సాధన కమిటీ పిలుపు
నవతెలంగాణ-మర్పల్లి
మండల కేంద్రంలో ఇంటర్సిటీ ట్రైన్ నిలుపుదల చేే యాలని ఆరేండ్లుగా ఎదురుచూస్తున్న మండల ప్రజల కల ఈ నెల 9న నెరవేరనున్నది. ఇంటర్సిటీ సాధన సమితి కమిటీ అధ్యక్షుడు కోమారి వెంకటేశం, ఉపాధ్యక్షుడు ఫైలు నర్సింలు మర్పల్లి మండల ప్రజా ప్రతినిధులు చేసిన ప్రయ త్నంతో ప్రజల కల నెరవేరింది. ఈనెల 9న ఇంటర్సిటీ ట్రై న్ మర్పల్లి మండల కేంద్రంలో నిలుపుదల చేయాలని రైల్వే సిఓఎం నాగ్య నాయక్ శుక్రవారం ఆదేశాలు జారీ చేయ డంతో మండల సాధన సమితి సభ్యులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 2017 జనవరి నుండి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది నాటినుండి మండల కేంద్రంలో నిలుపు దల చేయాలని సాధన కమిటీ తరపున రైల్వే మంత్రి పియు సోయల్ విష్ణు,రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్, ఆర్ ఎండి పాటియా, జిఎం గజానన్ మాలియా, ఆర్ ఎండి, డిఆర్ ఎం కేకే గుప్తా, సిపిటిఎమ్ సత్యనారాయణ లతో ప్రజా ప్రతినిధులు చేయని ప్రయత్నం లేదు. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు ఇంటర్సిటీ ట్రైన్ కోసం ప్రయత్నాలు చేశారు. సాధన కమి టీ అధ్యక్షుడు కోమారి వెంకటేశం పలుమార్లు ఢిల్లీ ముంబై వెళ్లి రైల్వే మంత్రులను కలిశారు. ఇంటర్సిటీ రైల్ నిలుపు దల కోసం కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు, అధికా రులకు, సాధన కమిటీ సభ్యులకు పలువురు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, వి ద్యార్థులు, ప్రజలు ట్రైన్ నిలుపుదలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం బీదర్ నుండి 8 గంటలకు మర్పల్లి నుండి హైదరాబాద్‌కు, సాయంత్రం హైదరాబాద్ నుండి 8 గంటలకు మర్పల్లి నుండి బీదర్‌కు వెళుతుందని అంద రూ సద్వినియోగం చేసుకొని రైల్వే పాసులు తీసుకోవా లని సాధన కమిటీ అధ్యక్షుడు కోమారి వెంకటేశం, ఉపా ధ్యక్షుడు ఫైలు నర్సింలు, జనరల్ సెక్రెటరీ అప్రోజ్లు కోరా రు. మర్పల్లి నుండి హైదరాబాద్‌కు రాకపోకలు మెరుగు పడటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.