Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్రాలు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- డీఎస్పీ శేఖర్ గౌడ్
నవతెలంగాణ- తాండూర్ రూరల్
శాంతి భద్రతల పరిరక్షణ కోసమే. కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరుగు తుందని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు శనివారం తాండూరు మం డలం కరణ్కోటలో సాయంత్రం కార్డెన్ సర్చ్ నిర్వహించడంతో అందులో 72. బైకులు 4. ఆటోలు.2. కార్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ. శాంతిభద్రత పరిరక్షణ కోసమే ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలన్నా రు. పత్రాలు ఉన్న వాహనదారులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలను చేయడం తప్ప ఎవరికి కూడా ఇబ్బంది కలిగించేందుకు కాదన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వాహనదారుడు సహకరించాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు భద్ర త నియమాలను పాటిస్తూ సీట్ బెల్ట్ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించు కోవాలన్నారు. వాహనాల పత్రాలతో పాటు లైసెన్సులు కలిగి ఉండాల న్నా రు. స్వాధీనం చేసుకున్న వాహనాలను కరణ్ కోట పోలీస్ స్టేషన్ ఆవరణ లో ఉంచుతారని సరైన పత్రాలు తెచ్చి మీవాహనాలను తీసుకొని వెళ్లవచ్చని తెలిపారు. కార్యక్రమంలో తాండూర్ రూరల్ సీఐ రాంబాబు. తాండూర్ పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి. కరణ్ కోట ఎస్సై. మధుసూదన్ రెడ్డి యాలాల బషీరాబాద్ తాండూర్. ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..