Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి వెలుగుపై శ్రద్ధ చూపాలి
- డబుల్ బెడ్ రూంల పంపిణీలో వేగం పెంచాలి
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తడిచిన ధాన్యం కొనుగోలు చేసి పార బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ లు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరిం త సమర్థవంతంగా అమలు జరిగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. శనివా రం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సీ.ఎస్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు కంటి వెలుగు, ఆరోగ్య మహి ళా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఎరువుల నిల్వ లను సమకూర్చుకోవడం, జీ.ఓ నెం.లు 58 , 59 , 76, 118 అమలు, ఆయిల్ పామ్ లక్ష్య సాధన తదితర అంశా ల ప్రగతిని సమీక్షిస్తూ సూచనలు చేశారు. ఆరోగ్య మహి ళా, కంటి వెలుగు కార్యక్రమాలకు మంచి స్పందన లభి స్తోందని, వీటి ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవ లందేలా చొరవ చూపాలని సీ.ఎస్ సూచించారు. ఈ విషయాలపై స్పందిచిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ జిల్లాలో 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంతో 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నామని తెలిపారు. కంటి వెలుగు శిబిరాల ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 6.40 లక్షల మందికి స్క్రీనింగ్ చేశా మని, వారిలో 89258 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశామన్నారు. మరో 76,952 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని నిర్ధారిస్తూ, 52,574 మందికి పంపిణీ పూర్తి చేశామన్నారు. లబ్దిదారులకు మరో రెండు రోజులలో డబు ల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 58 జీఓ కింద 2,394 మందికి ఇప్పటికే పట్టాలు అందించామని, మరో 302 పెండిం గులో ఉన్నాయన్నారు. 59 జీఓ కింద 13,231 దరఖా స్తులు రాగా, 2,786 ఆమోదం అయ్యాయని అన్నారు. 118 జీఓ కింద 5, 258 దరఖాస్తులు వచ్చాయని, 4026 దరఖాస్తులు అప్రూవల్ అయ్యాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.