Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-ధారూర్
వికారాబాద్ జిల్లా, బీఆర్ఎస్ అధ్య క్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనం ద్ 'మీతో నేను' కార్యక్రమంలో భాగం గా ధారూర్ మండల పరిధిలోని బా చారం, కొండాపూర్ కురు, కేరెల్లి గ్రా మాల్లో వరకు పర్యటించారు. కేరెల్లి పరిసర ప్రాంతాలకు అవసరాల రీత్యా నూతన విద్యుత్ సబ్ స్టేషన్ను మంజూరు చేయించారు. త్వరలో సబ్ స్టేషన్కు సరిపడా స్థలాన్ని పరిశీలించి ప నులు ప్రారంభింస్తారని తెలిపారు. గ్రామం లో ఐరన్ పోల్స్ తీసివేసి, అవసరమైన చోట నూ తన స్తంభాలు ఏర్పాటు చేసి, గ్రామంలో ట్రాన్స్ఫార్మర్కు దిమ్మె ఏర్పాటు చేయాలని, గ్రామంలో పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉం డాలన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇం డ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి సరి పడా నీటిని అందించాలన్నారు. సురక్షిత మై న మిషన్ భగీరథ తాగునీటి పట్ల అధికా రులు అవగాహనా సదస్సు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించా లన్నారు. గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు తొలగించాలన్నారు. ప్రతి ఇంటికీ మరు గుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు. పశు వైద్య అధికా రులు ప్రజలకు అందుబాటులో ఉండి పశువులకు వైద్య సేవలు అందించాలన్నా రు. కేరెల్లి గ్రామ పంచాయతీకి రైతుబంధు ద్వారా ఇప్పటివరకూ రూ.7 కోట్ల 34 లక్షలు రైతులకు ప్రభుత్వం అందించామన్నారు. మృతి చెందిన 15 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా ద్వారా రూ.70 లక్షలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ప్రజాప్ర తినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రా మస్తులు తదితరులు పాల్గొన్నారు.