Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన కలెక్టర్ ఎస్. హరీష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
వయోవృద్ధుల పోషణ ఫిర్యాదుల వెబ్ పోర్టల్ని శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్. హరీష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సదర్బంగా ఆయన మాట్లాడుతూ నిరాదరణకు గురి అయిన తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంరక్షణను చూసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన పిల్లలపై ఆన్లైన్లో సినియర్ సిటీజన్ మెయింటెనెన్స్ కేసెస్ మోనిటరింగ్ సిస్టం వెబ్ పోర్టల్ tsseniorcitizens.cgg.gov.in లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. వయోవృద్ధులు మొబైల్ ఫోన్ ద్వారా గాని ఇతర ఆన్లైన్ కేంద్రాల ద్వారా గాని ఈ వెబ్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు అన్నారు. ఈ పోర్టల్ ద్వారా అప్పిలేట్ ట్రిబ్యునల్ కలెక్టర్కు కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.