Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని లబ్ది పొందాలని ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్ మార్కెట్ యార్డు ఆవరణలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శ్రీనివాస్ రెడ్డి సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధర తీసుకుని లబ్దిపోందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ కమిటీ కార్యాలయం సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.