Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
8న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న యువ సంఘర్షణ నిరుద్యోగ నిరసన బహిరంగ సభను విజయవంతం చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సబావత్ బీచ్యా నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలసి గూడూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. నీళ్ళు,నిధులు, నియామకాలు అనే నినాదంతో, వేల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు దొరల పాలైందన్నారు. నిరుద్యోగ యువతను మోసం చేసి గద్దెనెక్కిన కేసీఆర్ను రేపు జరగబోయే ఎన్నికల్లో నిరు ద్యోగ యువతీ, యువకులే తగిన సమాధానం చెబు తారని ఆయన హెచ్చరించారు. ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సరూర్ నగర్ స్టేడియంలో జరిగే నిరుద్యోగ నిరసన సభకు యువతీ యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈసమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, కాంగ్రెస్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామచందర్ నాయక్, నాయకులు భానుకిరణ్, యాదయ్య గౌడ్, లక్ష్మయ్య, యాదయ్య, రాజేష్, భరత్ యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.