Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస మండల కార్యదరి ఎ.కుమార్
నవతెలంగాణ-కందుకూరు
పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల బిల్లులు వెంటనే చెల్లించాలినీ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎ.కుమార్ డిమాండ్ చేశారు. వారం రోజుల మేడే ఉత్సవాల సందర్భంగా కందుకూరు గ్రామ ఉపాధి హామీ పని ప్రదేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది వారాలుగా ఉపాధి హామీ కూలీలకు బిల్లులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తున్న ప్రదేశంలో మెడికల్ కిట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలన్నారు. ప్రతి వారం, వారం ప్లే స్లిప్పులు ఇవ్వాలని కోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. డీజిల్, పెట్రోల్, జీఎస్టీ , నిత్యవసరాల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారనీ మండిపడ్డారు. కూలీలకు కొలతలు లేకుండా రూ.600 లు, ప్రతి వ్యక్తికి 200 రోజులు పని దినాలు కల్పించాలన కోరారు. కూలీలకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించారన్నారు. లేని ఎడల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు బుడ్డీరపు శ్రీనివాస్, నాయకులు రాయి కంటి శేఖర్, గాదె కుమార్, గాదె సత్తయ్య, కె. రాములు, కూలీలు పాల్గొన్నారు.