Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8న ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు తరలాలి
- వ్యకాస జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య
నవతెలంగాణ-యాచారం
గత కొంతకాలంగా ఉపాధి హామీ చట్టం ద్వారా పనిచేస్తున్న కూలీలకు డబ్బులు జమ చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య విమర్శించారు. శనివారం యాచారం మండల పరిధిలో చౌదరిపల్లి, గున్గల్ గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాల్లో మేడే వారోత్సవాలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడే ద్వారా ప్రపంచంలో కార్మికులు సాధించుకున్న హక్కుల గురించి కూలీలకు వివరించారు. ఉపాధి హామీ కూలీల డబ్బులు ఇవ్వడంలో జాప్యం నిరసిస్తూ ఎనిమిదో తేదీన ఎంపీడీవో కార్యాలయం ముందు కూలీలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల కూలీలంతా పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని సూచించారు. ఎర్రజెండా పోరాటంతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీపై కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీలమ్మ, చంద్రయ్య, సత్తయ్య, అందాలు, అనిత, స్వరూప, నరసింహ, రాములు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.