Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు గ్రామాలకు ఒక్క గ్రామంలో మాత్రమే పంపిణీ
- మరో రెండు గ్రామాల్లో వాయిదా
- డ్రా పద్ధతిలో పంపిణీ, భయాందోళనలో లబ్దిదారులు
- అధికారులు రీ సర్వే చేసి,అర్హులకే ఇండ్లు ఇవ్వాలి
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు సిలివేరు రాజు
నవతెలంగాణ-మంచాల
డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో వాయిదా పడిన లింగంపల్లి, మంచాల గ్రామాల్లో అధికారులు రీ సర్వే చేసి అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలనీ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యు లు సిలివేరు రాజు అన్నారు.శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నోముల రెవెన్యూ పరిధిలోని లింగం పల్లి గేటు వద్ద 96 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తై, మూడేం డ్లు గడుస్తున్నా, పంపిణీ చేయకపోవడంతో సీపీఐ (ఎం)ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు పలుమార్లు వినతి పత్రం అందించినట్టు గుర్తుచేశారు. మూడు నెలల క్రితం నోముల, లింగంపల్లి, మంచాల గ్రామా లకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం జరుగు తుందని రెవెన్యూ అధికారులు ప్రకటించి నోములకు 30 ఇండ్లు, లింగంపల్లికి 36 ఇండ్లు, మంచాలకు 30 ఇండ్లు ఇవ్వడం జరుగుతుం దన్నారు.ఈ మూడు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్ల లిస్టును గ్రామ సభల్లో చదవటం జరిగిందనీ, అర్హులైన మరికొంత మందికి మూడు రోజులు గడువు ఇచ్చి దరఖాస్తులు తీసువాలని సూచించినట్టు వెల్ల డించారు. రెవెన్యూ అధికారులు టీమ్స్ గా ఏర్పడి దర ఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసినట్టు చెప్పారు. రెండు రోజుల క్రితం అర్హుల లిస్టును గ్రామ పంచా యతీకి పంపించి, ఈ మూడు గ్రామా ల్లో డ్రా పద్ధతి లో లబ్ది దారులను ఎంపిక చేస్తామని అధికారులు తెలియజేసినట్టు చెప్పారు. అయితే శనివారం నోములలో గ్రామ సభలో డ్రా పద్ధతిలో 30 మంది లబ్ది దారులను ఎంపిక చేయడం జరిగిం దన్నారు.కానీ లింగంపల్లి, మంచాల గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీల్లో వేసిన లిస్టులో అనర్హులు ఉన్నారని రీ సర్వే చేసి అర్హులైన వారికే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ప్రజలు కోర డంతో రెవెన్యూ అధికారులు ఇండ్ల పంపిణీ వాయిదా వేసినట్టు తెలిపారు.ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వాయిదా వేసిన లింగంపల్లి, మంచాల గ్రామాల్లో రీ సర్వే చేసి అర్హులైన వారికే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు.