Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గైర్హాజరు పట్ల సర్పంచులు ఎంపీటీసీల నిరసన
- పెండింగ్ బిల్లులు చెల్లించాలి
- విద్యుత్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం : ప్రజాప్రతినిధులు
- తలకొండపల్లిలో సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-తలకొండపల్లి
సర్వసభ్య సమావేశంలో తీర్మాణాలు అమలు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. శనివారం తలకొండపల్లి మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వసభ సమావేశం నిర్వహించారు. ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, సింగిల్ విండో చైర్మెన్ గట్ల కేశవరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ సభ ప్రారంభం కాగానే ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన జవాన్ల మృతి పట్ల మౌనం పాటించి, సంతాపం తెలిపారు. సమావేశంలోని సర్పంచులు, ఎంపీటీసీలు సభలో నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మండల సభకు ఎమ్మెల్యే హాజరు కాకపోతే తమ సమస్యలు ఏలా పరిష్కారమవుతాయని నిలదీశారు. నిత్యం కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజాకార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన మండల సభకు పలుమార్లు రాకపోవడం తమపై చిన్నచూపు చూడటమేనని, ఎమ్మెల్యే రావాలని ప్లకార్డులతో నినాదాలు చేపట్టారు. అదేవిధంగా తమ పెండింగ్ బిల్లులు చెల్లిం చాలంటూ నిరసన వ్యక్తం చేశారు. శాఖల వారిగా అధికారులు ఎజెండాలతో ప్రస్తావించగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిర్వహణ సక్రమంగా లేదని, విద్యుత్ సిబ్బంది తమకు సహకరించడం లేదన్నారు. సబ్ స్టేషన్ కార్యాలయాల్లో రాత్రి వేళలో మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నారని ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ సిబ్బంది ప్రవర్తన మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సర్పంచులు భక్తి కుమార్, రమేష్ యాదవ్, రఘుపతి, ఎంపీటీసీ అంబాజీతో పాటు పలువురు సభ్యులు ఏఈ కటారి యాను నిలదీశారు. ఉపాధి పనుల్లో జాబ్ కార్డు లేని వారికి జాబ్ కార్డులు వెంటనే మంజూరు చేయా లన్నారు. విజయ డయిరీ నుంచి రైతులకు సుమారు రూ.3,4 కోట్లు పెండింగ్‌లో పెంట్టారనీ, అవి ఆన్లైన్లో నమోదు కాలేదంటూ, చెల్లించడం లేదని జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ విజయ డయిరీ అధికారులకు తెలిపారు. ప్రాథమిక ఆస్పత్రి అధ్వాన పరిస్థితిలో ఉన్నదనీ, మూత్రశాలలు సరిగా లేవనీ, విద్యుత్ సరఫరా సక్ర మంగా రాక, తాగునీటికి అనేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని తెలిపారు. మండలంలోని పాఠశాల ల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఎవరు కూడా డిప్యూటేషన్లపై వెళ్లకూడదని తీర్మానించారు. మండలంలోని పలు చెరువుల్లో ఇరిగేషన్ అధి కారుల నిర్లక్ష్యం వల్ల నిబంధనలు అతిక్రమించి వందల సంఖ్యల యంత్రాలతో మట్టిని అక్ర మంగా హైదరాబాద్‌కు తరతిస్తున్నారని అన్నారు. ఆ మట్టిన విక్రయిస్తూ, లక్షల రూపాయల సొమ్ము చేసుకుం టున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ఇరి గేషన్ ఏఈ రమేష్‌ను నిలదీశారు. చెరువు శికాల్లోని మట్టిని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారని అన్నారు. ఆ మట్టి రైతుల లబ్ది కోసమే ఉపయోగించాలని తెలిపారు. మట్టి తర లింపుల్లో మీ వాటా ఎంత ఉందో చెప్పాలని సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో యంత్రా లతో మట్టి తరలిస్తున్న పోలీసులు, ఇరిగేషన్ అధి కారులు, రెవె న్యూ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోమనీ, వాల్టా చట్ట ప్రకారం నిబంధనలు పాటించాలని లేకుంటే సంబంధిత అధి కారులపై చర్యలు తీసుకుని, కోర్టును ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. గ్రామపంచాయతీల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పూర్తి చేసిన పనులకు నెలలు గడుస్తున్న బిల్లులు చెల్లించడం లేదంటూ తమ అనుమతి లేకుండా గ్రామపంచాయతీ అకౌంట్ నుంచి విద్యుత్ బిల్లులు, జీఎస్టీ బిల్లులంటూ డ్రా చేయడం ఎంతవరకు సమంజసమని సర్పంచులు కుమార్, రఘుపతి, రమేష్ యాదవ్, శ్రీశైలం, కిష్టమ్మ, లలిత జ్యోతయ్య, లక్ష్మణ్ నాయక్, ఎల్లమ్మ తిరుపతయ్యతో పాటు పలువురు సర్పంచులు నిలదీశారు. ఈ సర్వసభ్య సమావేశవంలో తీర్మానించిన పనులు పూర్తైయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, ఎంఈఓ సర్దార్ నాయక్, ఏవో రాజు, సీడీపీవో సక్కుబాయి, ఏఈలు కటారియా, విద్యాసాగర్, సీనియర్ అసి స్టెంట్ బాలవర్ధన్, వైద్యులు శంకరయ్య , విద్యా సాగర్, వైద్యులు , కస్తూర్బా గాంధీ నిర్వాహ కులు,సర్పంచులు కుమార్, రఘుపతి, రమేష్ యాదవ్, శ్రీశైలం, కిష్టమ్మ, లలిత జ్యోతయ్య, లక్ష్మణ్ నాయక్, ఎంపీటీసీ రమేష్, రఘు తదితరుల పాల్గొన్నారు.