Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ లింగయ్య చింతపట్లలో వేసవి వాలీబాల్ శిక్షణ
నవతెలంగాణ-యాచారం
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులంతా క్రీడాలపై ఆసక్తిని పెంచుకోవాలని సీఐ లింగయ్య సూచించారు. శనివారం యాచారం మండల పరిధిలోని చింతపట్లలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారంతో నిర్వహిస్తున్న వాలీ బాల్ పై వేసవి శిక్షణా శిబిరాన్ని సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలీబాల్ శిక్షణ శిబిరం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. విద్యార్థులు, యువకులు ఈ శిక్షణలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను పెంచుకోవాలని సూచించారు. నిత్యం ఊరిలో ఉన్న విద్యార్థుల అభి వృద్ధికి పాటుపడుతున్న మహమ్మద్ సాబీర్‌ను సీఐ అభినందించారు. చింత పట్లలో వేసవి క్రీడా శిబిరం నెల రోజులు వరకు కొనసాగుతుందని తెలిపారు. ఉదయం, రెండు గంటల పాటు ఫ్రీ కోచింగ్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ భిక్షపతి, గ్రామస్తులు కరుణాకర్‌రెడ్డి, యశ్వంత్, సాయి, దేవరాజ్, సిద్ధార్థ్, శివ, గణేష్, మనోజ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.