Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద అంబర్పేట పరిధిలో హెచ్ఎండీఏ యాక్షన్
- ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు
- రూ.45 కోట్ల విలువ చేసే మూడు ఎకరాల కబ్జాను నివారించిన అధికారులు హెచ్ఎండీఏ భూముల
- జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) భవిష్యత్తు అవస రాల కోసం ఆర్అండ్ఆర్ కింద సేకరించిన మూడు ఎకరా ల స్థలంపై వచ్చిన అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీిఏ) అధికారులు శనివారం ఉదయం నేలమట్టం చేశారు. విజయవాడ జాతీయ రహదారి సమీపంలో హెచ్ఎండీఏ యాజమాన్యం హక్కులు కలిగిన మూడు ఎకరాల ఖాళీ స్థలంపై స్థానికులు కొందరు ఆక్రమణలకు పాల్పడు తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో హెచ్ఎండీఏ భూ రికార్డులను సరిచూసుకుని స్థానిక తహసీల్దార్, పోలీసుల సహకారంతో హెచ్ఎండీఏ, ఓఆర్ఆర్ ల్యాండ్ ఎక్విజేషన్ అధికారి వి.విక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ (ఇన్చార్జి) వెంకటేష్ తమ సిబ్బందితో శనివారం ఉదయం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఐదు ఇండ్లు, ప్రహరీ గోడలు, గేట్లను అధికారులు ధ్వంసం చేశారు. కబ్జాదారులు లేదా ఆక్రమణదారులు ఐదుగురిని గుర్తించి వారిపై అబ్దుల్లాపూర్మేట్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. వాస్తవానికి అబ్దుల్లాపూర్మేట్ మండలం పెద్ద అంబర్పేట గ్రామం పరిధిలోని ఈ మూడు ఎకరాల భూములను 2010 డిసెంబర్ 31వ తేదీన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంచనామా చేసి హెచ్ఎండీిఏకు అప్పగించారు. ఔటర్ రింగురోడ్డులో భూములు కోల్పోయిన వారికి ప్రత్యమ్నా యంగా భూమి ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ భూ మిని హెచ్ఎండీఏకి కేటాయించింది. హెచ్ఎండీఏ భూ ముల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.