Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్
- మే డే ఉత్సవాల్లో భాగంగా వైద్య శిబిరం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికీ ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వాలని సీఐటీయూ రం గారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ కోరారు. కాటే దాన్లో జరుగుతున్న మేడే వారోత్సవాల్లో భాగంగా శని వారం కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిం చారు. లక్ష్మీ హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ సహకారంతో సిస్టర్ ప్రియాంక, ఫార్మసిస్టు పవన్ ఆధ్వర్యంలో కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరికీ వివిధ రకాల పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులకు సరైన ఆరోగ్య భద్రత లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాటేదాన్‌లో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీలో సరైన సదు పాయాలు లేక వైద్య పరీక్షల కోసం కార్మికులు ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్తున్నారని తెలిపారు. స్థానికంగా పనిచేస్తున్న చాలా పరిశ్రమల్లో కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతీ కార్మికుడికి ఈఎస్ఐ ఆరోగ్య భద్రత కార్డు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 8న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాల్సిన బాధ్య త కార్మికులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాజేంద్రనగర్ మండల కన్వీనర్ రుద్రకుమార్, శంషాబా ద్ మండల కన్వీనర్ మల్లేష్, గండిపేట మండల కన్వీనర్ ప్రవీణ్‌కుమార్, రాజేంద్రనగర్ మండల కన్వీనియం కమిటీ సభ్యులు వెంకటయ్య, రహీం, భాస్కర్, ప్రవీణ్, అనిల్, హనుమంతు, సచిన్, దత్తు, టీ.వెంకటేష్‌గౌడ్, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.