Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది వెంకటేష్
నవతెలంగాణ వికారాబాద్ కలెక్టరేట్
చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది వెంకటేష్ సూచిం చారు. వికారాబాద్ మండలం సర్పన్‌పల్లి గ్రామంలో శనివారం 'వృద్ధుల, తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత' అనే అంశంపై జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వికారాబాద్ చీఫ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ న్యాయవాదులు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యా యవాదులు వెంకటేష్, రాము మాట్లాడుతూ తల్లిదండ్రుల పోషణ సంరక్షణ బాధ్యత వారి పిల్లలదే అన్నారు. వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. ఈ విషయాన్ని సీనియర్ సిటిజన్స్ చట్టంలో నిర్దేశించారని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం వారి బాగో గులు చూడకపోతే వారికి వారి పిల్లలు మైంటెనెన్సు ఇవ్వా లని తెలియజేశారు. అప్పు తీసుకొని ప్రామిస్సరీ నోట్‌పై సంతకం చేసేట్టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రూపాయలు ఎంత రాసారో చూసుకోని సంతకం చేయా లని అన్నారు. అలాగే క్రిమినల్ కేసులు ఉండి న్యాయ వాదిని పెట్టుకోలేని స్థోమత లేని వారికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదిస్తే వారి అర్హతను బట్టి వారికి ఉచితంగా న్యాయవాదిని నియమిస్తారని తెలిపారు. అలాగే రైతులకు ఏవైనా న్యాయ సమస్యలు ఉంటే నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయి ఉంటే వారికి తగిన న్యాయ సలహా ఇచ్చి, న్యాయం చేస్తామన్నారు. రైతుల కోసం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తోందని వివరించారు. పోక్సో చట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాకేర బేగం ఫకీర్ఖాన్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఆనంద్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు అనంతయ్య, గ్రామ కార్యదర్శి విజయరాణి పాల్గొన్నారు.