Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా యువతకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
రేపు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించే యువ సంఘర్షణ సభను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ జిల్లా యువతకు పిలుపునిచ్చా రు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఆ యన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించినట్లునే, సోమవారం హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తూ యువతకు భరోసా కల్పిస్తారన్నారు తెలిపారు. ఈ సభకు 4 నుంచి 5 లక్షల మం ది హాజరు కానున్నారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తర లి వచ్చి సభను దిగ్విజయం చేయాలని సూ చించారు. ఇందుకు పార్టీ మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు యువతను పెద్ద ఎత్తున తరలించేందుకు కృషి చేయాలన్నా రు. జిల్లాలోని కళాశాలల యాజమా న్యాలు కూడా విద్యార్థులను సభకు పంపేలా సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే కర్నాటక లో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు కిషన్‌నాయక్, నర్సింలు, ఆనం త్‌రెడ్డి, కృష్ణారెడ్డి,ఎర్రవల్లి జాఫర్, రవీందర్, వెంకటేశం, వికారాబాద్ మండల అధ్యక్షుడు బి.రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్ మురళి, ఆసిఫ్, సలీష్, రఘుపతిరెడ్డి, శ్రీను ముదిరాజ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.