Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ- మహేశ్వరం
అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవా రం నాగారం నుండి పడమటి తండా వరకు రోడ్డు నిరా ్మణం అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనుల కోసం రూ. 1 కోటి 50 లక్షలు మంజూరు చేసినందుకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆద్వర్యంలో సెక్రటేరి యట్ లోని మంత్రి చాంబర్లో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ పాలనలోనే తండాలు, గ్రామాలు అభివృద్ధిలో పయనిస్తున్నాయని అన్నారు. మహేశ్వరం నియోజక వర్గానికి సీఎం కేసీఆర్ అనేక నిధులను మంజూరు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. నియోజక వర్గంలో జరుగుతున్న అభివద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ పార్టీ నాయకులు విమర్శలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఉపాద్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోషియేషన్ చైర్మన్ మద్ది కరుణాకర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూన యాదయ్య, మండల ప్రధాన కార్యదర్శి మర్యాద రాఘవేందర్‌రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అద్యక్షుడు థామస్ రెడ్డి, బీసీ సెల్ నియో జక వర్గం అధ్యక్షుడు మల్లేశ్యదవ్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, నవీన్, కుమార్ మాజీ సర్పంచ్ వడ్య రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.