Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భాస్కర్ సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి లో ఉన్న మాసాబ్ చెరువును కాపాడా లని, ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేసి, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మాసబ్ చెరువును రీ సర్వే చేసి హద్దులు గుర్తించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తుర్కయం జాల్ మున్సిపాలిటీలోని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తా నుండి మాసాబ్ చెరువు వరకు ర్యాలీగా వెళ్లి సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ధర్నా చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలో ఉన్న చెరువులను కుంటలను వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి అభివద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ఆనుకొని నాగార్జునసాగర్ రహదారిలో ఉన్నటువంటి తుర్కయంజాల్ మాసబ్ చెరువు 499 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువుకు సంబంధించి వందల కోట్ల రూపాయల విలువైన ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో ఉన్నటువంటి భూ ములు అప్పనంగా అన్యాక్రాంతమై కబ్జాకు గురైతుంటే చోద్యం చూస్తుండడం గర్హనీయమని అన్నారు. తుర్కయం జాల్ రెవిన్యూ సర్వేనెంబర్ 205లోని సుమారు 12 ఎకరాల భూమి ఇది పూర్తిగా బఫర్‌జోన్ కిందికి వస్తుంది ఈ భూమిలోనీ పట్టాదారులు కేవలం వ్యవసాయం సాగు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది కానీ ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే మున్సిపల్ అధికారులు కుమ్మక్కై ఇట్టి భూమికి ఎన్ఓసి ఇచ్చి రాత్రి సమయాలలో దొంగ దారిన అడ్డగోలుగా వందలకొద్దీ లారీలు టిప్పర్లతో మట్టితో చెరువును నింపడం అక్రమ నిర్మాణాలు చేసుకో వడానికి పులిగోల్పి పరోక్షంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు వందల కోట్ల రూ పాయలు దండుకునే విధంగా చేశారన్నారు. దీని కార ణంగా చెరువు సమతుల్యత దెబ్బ తినడమే కాక బ్యాక్ వాటర్ పెరిగి అనేక కాలనీలో మునిగిపోతున్నాయని తద్వారా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా రాజకీ య పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధుల పాత్రను కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. తు ర్కయంజాల్ మాసబ్ చెరువు భూ ఆక్రమణకు సంబంధిం చి, అక్రమ నిర్మాణాలకు సంబంధించి, ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇల్లీగల్ ఎన్వోసీలకు సంబంధించి జిల్లా కలెక్టర్ సుమోటోగా చర్యలు తీసుకోవాలని అంతేకా కుండా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వమే దీనికి ప్రధాన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించని ఎడల అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యం లో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడ తామని ఆర్డీవో కలెక్టర్ కార్యాలయాలను సిబ్బంది ఇస్తామని హెచ్చ రించారు.
కార్యక్రమంలో రైతు సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డి రామచందర్, కాంగ్రెస్ తుర్కయంజాల్ మున్సిపల్ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఐలయ్య, బీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఆర్ కళ్యాణ నాయక్, కొంతం యా దిరెడ్డి, సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి డి కిషన్, జిల్లా నాయకులు ఇ నర్సింహ, బిజెపి నాయకులు బచ్చిగల్ల రమేష్, కొత్త అశోక్ గౌడ్, బీఎస్పీ నాయకులు గ్యార మల్లే ష్, వద్దిగల బాబు, టీడీపీ నాయకులు వీరేశం, వెంకటేష్, కౌన్సిలర్లు కాకుమాను సునీల్, బొక్క రవీందర్ రెడ్డి, నా యకులు రొక్కం చంద్రశేఖర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు సత్యనారాయణ, భాస్కర్, మాధ వరెడ్డి, మాల్యాద్రి, యాదగిరి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.