Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కులగణన చేపట్టడం ప్రజాస్వామిక మౌలికత. శాస్త్రీ యంగా తీసిన లెక్కలతో ప్రణాళికబద్ధంగా చర్యలు తీసు కోవడం కేంద్ర ప్రభుత్వ కనీస బాధ్యత అని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. బీసీ కులగణన అనివార్యత పరిణామాలు అనే అంశంపై గచ్చిబౌలి హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యా లయంలో అల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియే షన్, ఓబీసీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీపీల కుల గణన అనే కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా ఆయన, ఆత్మీయ అతిథులు గా ఆచార్య జలందరాచారి, ఓబీసీ నేతలు రమేష్, కురుమూర్తి సాయికుమార్, సంస్కృతి, కృష్ణవేణిలు పాల్గొనగా, వివిధ విభాగాలకు చెందిన పరిశోధక విద్యార్థులు, పిజి. విద్యార్థు లు సదస్సుకు హాజరయ్యారు. వకుళభరణం మాట్లాడుతూ కులగణన నిర్వహించి, ఆ దిశగా వెలువడిన వాస్తవ సమా చారంతో తమ జీవన ప్రమాణాల్లో మెరుగుదలను బీసీలు కోరుకుంటున్నారన్నారు. కులగణనను చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రకటించడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రకటన ప్రజాస్వామ్య పరిపాలకులు చేయాల్సింది కాదన్నారు. అన్ని వన్య ప్రాణులు, పశువులు, సరీసృపాల లెక్కలు తీస్తున్నారు కానీ బీసీల లెక్కలు మా త్రం తీయకపోవడం అన్యాయమన్నారు. వెనుకబాటు త నంను నిర్దిష్టంగా సేకరించి, ఆ దిశగా చర్యలకు ఉపక్ర మిస్తేనే, అంతరాలు, వివక్షత, అణచివేతలు తొలగిపోతా యన్నారు. ఆ పనిని ఎందుకు చేయడం లేదని ఆయన ప్ర శ్నించారు. దురదృష్టం ఏమిటంటే 2011-15 సంవత్స రాల మధ్య 5 వేల కోట్లు వెచ్చించి, చేపట్టిన ''సామాజిక, ఆర్థిక కులగణన'' వివరాలను కేంద్ర ప్రభుత్వం బయటపె ట్టక పోవడం దుర్మార్గమన్నారు. కేంద్రం చెప్పినట్లు అందు లో తప్పులు దొర్లి ఉంటే, సరిదిద్ది ప్రకటించాల్సింది పోయి, బహిర్గతం చేయకపోవడం విస్మయాన్ని కల్గిస్తుందన్నారు. కేంద్రంలో బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు కేంద్రం స్పందించకపో వడం బా ధాకరమన్నారు. యూనివర్సిటీల విద్యార్థి మేధావులు ఇలాంటి డిమాండ్లపై సాధికారికంగా, అధ్యయన నేపథ్యం గా ''వ్యాసాల'' రూపంలో పత్రికలకు రాయాలని కోరారు. ఎక్కడికక్కడ సెమినార్లు, సదస్సులు నిర్వహించి సిద్ధాంత భావజాల వ్యాప్తితో తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు కార్యరూపం ఇవ్వాలని కోరారు.