Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
- ముద్విన్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-ఆమనగల్
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. కడ్తాల్ మం డలంలోని ముద్విన్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మె న్ గంప వెంకటేష్ గుప్తా తదితరులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. అధికార దాహంతో విపక్షాలు చేసే ఆరోప ణలు ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. ఇతర రాష్ట్రా ల్లో లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తన పర్యటనలో భాగంగా ఇటీవల మతి చెందిన ఎక్వాయిపల్లి మాజీ సర్పంచ్ పి.వీరయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే పరా మర్శించి ఓదార్చారు. అనంతరం ఆమనగల్ మార్కెట్ యార్డు ఆవరణలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించి రైతులతో మాట్లాడారు. మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అదేవిధంగా స్థానిక రైస్ మిల్లుల యజమానులతో మాట్లా డి రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోల్లు చేయాలని సూచించారు. అంతకు ముందు ఆయన కడ్తా ల్ మండలంలోని న్యామతాపూర్ గ్రామంలో స్థానిక సర్పం చ్ రవీందర్ రెడ్డి తన తండ్రి మోహన్ రెడ్డి, తాత బుచ్చి రెడ్డిల జ్ఞాపకార్థం స్థాపించిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ కమి టీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ జ్యోతి, ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్, లచ్ఛిరామ్ నాయక్, మంజుల చంద్రమౌళి, సర్ఫంచ్లు సులోచన సాయిలు, యా దయ్య, భారతమ్మ నర్సింహ గౌడ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు జోగు వీరయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ దోనా దుల సత్యం, ఏఓ శ్రీలత, ఉపసర్పంచ్ వినోద్, డైరెక్టర్లు సేవ్యా నాయక్, రమేష్ నాయక్, వెంకట్ రెడ్డి, వెంకటేష్, బీ ఆర్ఎస్ అధ్యక్షులు కంబాల పరమేష్, డాక్టర్ పత్య నా యక్, నాయకులు దుడ్డు ఆంజనేయులు, సయ్యద్ ఖలీల్, గుత్తి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.