Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకులు శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తెలంగాణ ప్రభుత్వం పర్మినెంట్ చేయకుండా వారు చేస్తున్న ఉద్యమా న్ని అణచివేసేందుకు చేస్తున్న చర్యలను మానుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మంగళ వారం ఒక పట్టణంలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోనికి పాల్పడు తూ కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించడం సిగ్గుచేటని తెలిపారు. జూనియర్ పంచా యతీ కార్యదర్శులను వెంటనే పర్మినెంట్ చేయాలని డి మాండ్ అదేవిధంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ని ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపు లకు గురి చేస్తున్నారన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తొలగిస్తామని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గ మన్నారు. భారత రాజ్యాంగం ద్వారా సమ్మె చేసే హక్కు సంఘం పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్య మాన్ని అణచివేసే ధోరణి మా నుకోవాలని తెలిపారు. కేంద్ర బీజేపీ అధికార దుర్వినియోగా నికి పాల్పడుతూ భారత రా జ్యాంగం కల్పించిన చట్టాలను కార్మిక కర్షక హక్కులని తొలగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజా ఉద్యమాల ను అణచివేసే ధోరణి ప్రదర్శిస్తున్న దొరల పాలనకు తెలం గాణ ప్రజలు గొరిగట్టాలని డిమాండ్ చేశారు. పెద్దేముల్ మండల కేంద్రంలో తట్టే పల్లిని మండల కేంద్రం చేయా లని అనేక రోజులుగా డి మాండ్ చేస్తూ ఉద్యమం చేస్తున్న మండల సాధన కమిటీ సభ్యులను అక్రమ అరెస్టులు చేయ డం తీవ్రంగా ఖండిసున్నట్లు తెలిపారు. అధికారదుర్విని యోనికి పాల్పడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు గద్దె దింపాలని పిలుపు నిచ్చారు.