Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహేశ్వరం
చైన్ స్నాచింగ్ దొంగలను పట్టుకొని రిమాండుకు తరలిం చిన ఘటన మహేశ్వరం పోలీస ుస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మహేశ్వరం ఏసీపీ అంజయ్య తెలిపిన వివ రాల ప్రకారం.. దుబ్బచెర్లకి చెం దిన మహిళ వెటర్నరీ దవాఖానలో ఉద్యోగం చేస్తుంది. మోటర్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు యువకులు శివకుమార్, గజేంద్రలు బీఎన్‌రెడ్డి నగర్లో నివా సం ఉంటున్నారు. ఇద్దరు యువకులు గొర్లకు మందు కావాలని నాటకం ఆడారు. పొట్లంలో మందును కడుతున్న సందర్భంలో ఆమె మెడలో ఉన్న గొ లుసును దొంగిలించి అక్కడి నుండి పరారయ్యారు. మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు. పై అధికారుల ఆదేశాల మేరకు మస్సాన్పల్లిలో మే 8న సాయంత్రం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వా రిని పోలీసులు విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. శివకుమార్, గజేంద్రలు హస్తినాపురం మలబార్ గోల్డు దగ్గర సొమ్మును కుదువబెట్టారు. ఆ షాపు యజమానికి నోటీసులు అందించి చోరీకి గురైన రెండున్నర తులాల చైను స్వాధీన పరుచుకున్నారు. ఇద్దరి యువకులను రిమాండ్‌కు తరలించిన ట్లు ఏసీపీ తెలిపారు. పొలాల దగ్గర ఉన్న రైతులు, ప్రజలు అనుమాని తుల వ్యక్తుల పట్ల తగుజాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన కోరారు. సీఐ మధు సూదన్, ఎస్సైలు నరసయ్య, సుబ్బారెడ్డి, వెంకటయ్య సిబ్బంది పాల్గొన్నారు.