Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తమ ప్లాట్‌కు అడ్డంగా అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులను తొలిగిం చాలని కోరుతూ మాతృశ్రీ నగర్ కాలని, కల్వరి టెంపుల్ రోడ్లో ప్లాట్ నెంబ ర్ 215 యజమాని దివాకర్ రెడ్డి చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సు ధాంష్కు వినతిపత్రం అందజేశారు. తన ఫ్లాట్ గేటుకు ఎదురుగా అక్రమం గా వెలిసిన షాపులు ఉన్నవి తను కన్స్ట్రక్షన్ మొదలు పెడదామని నిర్ణయించు కున్నానని, తన స్థలం ముందట ఉన్న షాపుల వల్ల తనకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఆ షాపుల వద్ద కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగు తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. చిల్లర వ్యాపారస్తులు తరుచూ గొడవ లు పడుతూ న్యూసెన్స్ చేస్తున్నారని, అక్రమంగా వెలిసిన షాపులను తక్షణ మే తొలిగించాలని ఆయన కోరారు. స్పందించిన డిప్యూటీ కమిషనర్ తాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు దివాకర్‌రెడ్డి తెలిపారు.