Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూర్
కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గూడురు, మురళినగర్ గ్రామాల్లో ఎంపీపీ మందజ్యోతి పాండు, సర్పంచ్ పి.శ్రీలత, సర్పంచ్ సోముల నాయక్‌తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు పథకం ద్వారా కంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి నిరుపేదలకు అవసరమైన వారికి కంటి అద్దాలను , ఆపరేషన్లు అవసరమైన మేరకు ప్రభుత్వమే ఆపరేషన్లు చేయిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తుందనితెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఎల్లారెడ్డి, లలితా కుమార్ ముదిరాజ్, పాలకవర్గం సభ్యులు ఆంజనేయులు, రామకృష్ణ, రంగమ్మ, కవిత, లక్ష్మమ్మ, కో-ఆప్షన్ సభ్యులు, కొర్వి సురేందర్ ముదిరాజ్, పాపిరెడ్డి, ఎస్సీ సెల్ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు సాయిలు, మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, నాయకులు పాండు గౌడ్, బర్కం వెంకటేష్, ప్రకాష్‌రెడ్డి, హనుమంతు యాదవ్, నరసింహ యాదవ్, శకీల్, నరసింహారెడ్డి, కాకి నరసింహ ముదిరాజ్ జైపాల్ రెడ్డి, సెక్రటరీ జానిమియా, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.