Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాలను సద్వినియోగించుకోవాలి
- ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
నవతెలంగాణ-కోడంగల్
రైతులను దళారుల బారి నుంచి రక్షించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. కోడంగల్ పట్టణంలోని మార్కెట్ యార్డులో, కొడంగల్ మండలంలోని అంగడి రైచూర్, చిట్లపల్లి, చిన్న నందిగామ గ్రామాలలో మంగళవారం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ రైతుల శ్రేయస్సే లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యం క్వింటాలకు ఏ గ్రేడ్ 2,060, బి గ్రేడ్ రకానికి 2,040 ధర నిర్ణయించినట్టు తెలిపారు, ఐకెపి, సొసైటీల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు, వరి పంట దిగుబడులు ఇంకా పూర్తిస్థాయిలో రాకముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి లాభాలు అర్జించాలన్నారు, కొనుగోలలో పారదర్శకత పాటించినున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దామోదర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీములు, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, సర్పంచ్ వెంకట్ రెడ్డి, టిటి రాములు నాయక్, సిద్ధి లింగప్ప, మాజీ జెడ్పిటిసి పకీరప్ప వెంకటమ్మ, కోట్ల యాదగిరి, బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గోడల రామ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, బాకారం అరుణ్, చిన్న నందిగామ సాయిలు, సర్పంచ్ సయ్యద్ అంజాద్, శంకర్ బాబు, మల్లేష్, దత్తు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.