Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 3 కోట్ల10 లక్షలతో పనులకు శ్రీకారం
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
బండ్లగూడ కార్పొరేషన్‌ను అభివృద్ధిల్లో అదర్శంగా చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ అన్నారు. మంగళవారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2,5,6,7,9,15,18,22 వార్డుల్లో అభివృద్ధి పనులకు పాలక వర్గ సభ్యులతో కలిసి శ్రీకారం చూటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి 3 కోట్ల 10 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీతో పాటు ఐదోవ వార్డుల్లో 50 లక్షలతో కమ్యూనీటి హల్ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను నిత్యం చేస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ సర్కారు హయంల్లో కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీలను ఆదర్శంగా చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంల్లో కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మేయర్ మహేందర్‌గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డి, సింగిల్ విండో ఛైర్మెన్ రాందాస్, కార్పొరేటర్లు షాపూరం శ్రీనాథ్‌రెడ్డి, మంద రవీందర్‌రెడ్డి, తలారి చంద్రశేఖర్, తలారి పద్మావతిపాండు, సంతోషిరాజీరెడ్డి, శ్రీలతాసురేష్గౌడ్, సాగర్, ప్రశాంత్‌నాయక్, నిఖిలా సంగారెడ్డి, పద్మావతి పాపయ్యయాదవ్, కో-ఆప్షన్ సభ్యులు మాలకీరత్నం, జగదీష్, సయ్యద్‌ఖాజా, సుమన్, విష్ణువర్థన్, మల్లేష్, అంతారం నరేష్, సంపత్, నదీం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.