Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకరపల్లి
శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సింగపూర్ వార్డులోని సింగపూర్ రోడ్డులో విద్యుత్ వైర్లు వేలాడుతుండటంతో పంట పొలాలకు వెళ్లే రైతులు ప్రజలు భయందోళనకు గురవుతున్నారని వార్డు కౌన్సిలర్ చంద్రమౌళి అన్నారు. మంగళవారం శంకర్పల్లిలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న సమస్యను పట్టించుకోవడంలేదని అన్నారు. కౌన్సిలర్ చెప్పిన పట్టించుకోకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.వైర్లు కిందకు వేలాడుతుండటంతో పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.