Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి డిమాండ్లను నెరవేర్చాలి
- బీజేపీ ఎంపీ బిజీ భూషణ్ శరణ్ సింగ్ను వెంటనే అరెస్ట్ చేయాలి
- ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షురాలు వడ్ల మంజుల డిమాండ్
నవతెలంగాణ-చేవెళ్ల
దేశానికి పథకాలు సాధించి గౌరవాన్ని కాపాడిన మహిళా రేంజర్లో తమపై లైంగిక వేధింపులు జరుపు తున్నారని దానికి నిరసనగా మండల కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ మహిళా సం ఘం ఆధ్వర్యంలో ధర్నా నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా చేవెళ్ల నియోజకవర్గం మహిళా సంఘం నాయ కురాలు వడ్ల మంజుల, అమృత, మాధవి, వినోద, సాయిల మ్మ, సంపూర్ణ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నాలో ఎన్ఎఫ్ఐ డబ్ల్యు నియోజనం అధ్యక్షరాలు వడ్ల మంజుల మాట్లాడుతూ...కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద 4 నెలల కితం కొన్ని వారాల పాటు ధర్నా నిర్వహించారు. విచార కమిటీ వేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ విచార కమిటీ ముందు ఇప్పటివరకు ఎలాంటి బాధితులకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బీజం భూషణ్ శరణ్ సింగ్ను వారిపై వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని వారి గౌరవాన్ని భంగం కలిగించినట్టని అతని వెంటనే అరెస్టు చేయాలని రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చట్టసభ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మహిళా రేంజ్లపై జరిపిన లైంగిక వేధింపులకు సుప్రీంకోర్టు జడ్జిచే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అందుకు బాధ్యులైన ఇతరుల పైన కూడా చట్టపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా చూడాలని మహిళా సంఘం నాయకులు కోరారు. చేవెళ్ల నియోజకవర్గం మహిళా సంఘం నాయకురాలు మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు మాధవి, సాయిలమ్మ, అమృత, మహిళలు నిర్మల, రేఖ, వినోద, సుగుణ, జయమ్మ, లక్ష్మి, అరుణ, అండాలు, లత, సరిత, వడ్ల హైమావతి, దాసరి మంజుల, బి సంపూర్ణ, వెంకటమ్మ, అరుంధతి, అరుణ, అండాలు తదితరులు పాల్గొన్నారు.