Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12వ రోజుకు చేరుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె
- మోకాళ్ళపై నిలబడి నిరసన
నవతెలంగాణ-ఆమనగల్
తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించేవరకు వెన క్కి తగ్గె ప్రసక్తే లేదని జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచా యతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. టీపీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచా యతీ కార్యదర్శులు చేపడుతున్న నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం ఆమ నగల్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన కొనసాగుతున్న దీక్షా శిబిరంలో కందుకూర్ డివిజన్ పరిధిలోని కందు కూర్, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్, తలకొండపల్లి మం డలాల జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్య దర్శులు పాల్గొని మోకాళ్ళపై నిలబడి తమ నిరసనను వ్య క్తం చేశారు. నిరసనలో భాగంగా డివిజన్ అధ్యక్షుడు జావి ద్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్క రించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు నిరవధిక దీక్షను కొనసాగిస్తామని హెచ్చరించారు. స్థానిక బీఎస్పీ నా యకులు కార్యదర్శుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు రమేష్, రాము, మురళీమోహన్, శివకుమార్, వాజిద్, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.