Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముప్పా, వర్టెక్స్ బిల్డర్స్ పైనా సాగిన సోదాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో శనివారం ఐదో రోజూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలను నిర్వహించారు. దీంతోపాటు ముప్ప, వర్టెక్స్ బిల్డర్స్ ప్రధాన కార్యాలయాలలోను ఐదవ రోజు సోదాలు కొనసాగాయి. గత మంగళవారం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాదాపు యాభై మందికి పైగా ఈ సోదాలను నిర్వహిస్తున్నారు.
నేర విచారణలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడొద్దు : డీజీపీ
రాష్ట్రంలో నేర పరిశోధనలో చట్ట ప్రకారం వ్యవహరించాలనీ, ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలని అన్ని జిల్లాల ఎస్సీలు, ఐజీలను రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ముఖ్యంగా నేర విచారణకు సంబంధించిన వర్టికల్స్‌ను ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. శనివారం ఆయన అన్ని జిల్లాల ఏస్పీలు, రేంజ్ డీఐజీలు, జోన్ల ఐజీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.