Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మక్క సారలమ్మ నుంచి ప్రారంభం
- ఈనెల 24, 25, 26 తేదీల్లో యాత్రకు బ్రేక్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్లేందుకు ఈనెల 6 నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను ప్రారంభించ నున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవం త్‌రెడ్డి చెప్పారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ నుంచి ప్రారంభమై, మహబూబాబాద్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో తాను ప్రత్యక్షంగా యాత్రలో పాల్గొంటానన్నారు. శనివారం హైదరాబా ద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రేతో కలిసి ఆయన విలేకర్ల తో మాట్లాడారు. కొత్త నియామకాలు వచ్చే వరకు పాత మండలాధ్యక్షులు యాత్రకు పని చేస్తామన్నా రు. ఈనెల 24, 25, 26 తేదీల్లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతాయనీ, అందు కోసం ఆ మూడు రోజులు యాత్రకు విరమిస్తామ న్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం కోవిడ్ సమయంలోనే కాక నిత్యం ప్రజల కోసం కొట్లాడే సీతక్క నియోజకవర్గం నుంచే ఈ యాత్ర చేపట్టడం సంతోషకరమన్నారు. ఆనాడు రాజులు, రాచరికం మీద పోరాడిన సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తి తోనే ఈ యాత్ర చేస్తున్నట్టు తెలిపారు. బీజేపీ బీఆర్ ఎస్ ఒకే తాను ముక్కలని ఆరోపించారు. అన్ని విష యాల్లో వైఫల్యం చెందిన కేసీఆర్ అబద్ధాలను గవ ర్నర్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ విధానాలు అన్ని ఒక్కటేనన్నారు. మంత్రి కేటీఆర్‌కు రాహుల్‌గాంధీపై కాకుండా క్యాట్ వాక్, డిస్కో డాన్స్‌లపై మాట్లాడుకుంటే మంచిదని సూచిం చారు. సీఎంకు ప్రజలు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వా సం లేదనీ, వారికి ఇవే చివరి ఎన్నిక లని చెప్పారు. అందుకే కుమారుడికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశ మిచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్ఎస్ యూఐ నాయ కులు అక్రమంగా జైలుకు పంపడం సరికాదన్నారు. విద్యార్థి నేతల అరెస్టును టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ ఖండించారు.