Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై బంజా రాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన 12 మందితోపాటు, అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టిన 16 మంది అభ్యర్థులపై 341, 147, 149, 352, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. వాస్తవానికి దేహదారుఢ్య పరీక్షల్లో జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని అభ్యర్థులు అనేక రోజులుగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులను నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. డిజిటల్ కొలతల పద్ధతి వల్ల వేలాది మంది అభ్యర్థులకు నష్టపోయారని తెలిపారు. ఈ విషయంలో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.
ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోగా పోరాడుతున్న అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెట్టడం మూలంగా వారి భవిష్యత్తు ఉద్యోగావకాశాలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
అభ్యర్థులపై ఆ కేసులను ఉపసంహరించుకోవాలి : ఏఐవైఎఫ్
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలీ ఉల్లా ఖాద్రీ, కె ధర్మేంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన 12 మందితో పాటు, అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టిన 16 మంది అభ్యర్థులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. అభ్యర్థుల పట్ల ప్రభుత్వం, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిం చాలని కోరారు. వారిపై నమోదు చేసిన కేసుల కారణంగా భవిష్యత్లో నష్టపోయే ప్రమాదముందని తెలిపారు.