Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలిలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వాస్తవాలకు భిన్నంగా ఉన్న గవర్నర్ ప్రసంగానికి తాను ధన్యవాదాలు తెలుపలేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రసంగంలో కొంత మేరకైనా వాస్తవాలుంటే ధన్య వాదాలు తెలిపేవాడినని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి ఆయా రంగాల వారీగా మాట్లాడుతూ విమర్శిస్తుంటే టీఆర్ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్, ప్రభాకర్‌రావు తదితరులు అభ్యంతరం తెలిపారు. అబద్ధాలాడొద్దంటూ కామెంట్ చేశారు. ఇందుకు బదులుగా జీవన్ రెడ్డి గవర్నర్ తన ప్రసంగంలో అబద్ధాలే చెప్పారని వ్యాఖ్యానించారు. 24 గంటల విద్యుత్ నిజంగా సరఫరా అవుతుంటే సబ్ స్టేషన్ల వారీగా శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలో సబ్ స్టేషన్లలో వారీగా నిరంతర కరెంటు రావడం లేదని తెలిపారు. రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుంటే ఓట్లు అడగబోమని చెప్పాలంటూ సవాల్ విసిరారు. మార్కెట్లలో హమాలీ ఛార్జీల భారం రైతులపై పడుతున్నదనీ, గత ప్రభుత్వాల మాదిరిగా ప్రభుత్వమే ఆయా ఛార్జీలను భరించాలని కోరారు. చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని పండిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. దీనికి జీవన్ రెడ్డి బదులిస్తూ, 'మీరు భావిస్తే సరిపోద్దా?' అంటూ ప్రశ్నించారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ, రైతు బీమా పథ కాలు ఎటు పోయాయంటూ ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలైన రైతు సంక్షేమ కార్యక్రమాలను నిలిపేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో ఏడు మండలాలను కేంద్రం ఏపీలో కలిపిందనీ, పసుపు బోర్డు ఇవ్వకుండా మో సం చేసిందనీ, ఇంత చేస్తున్నా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తి ఏమైందని ప్రశ్నించారు. కేంద్రంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తే తాము కూడా పాల్గొంటామని తెలిపారు.