Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన ఆఫీసుకు శంఖుస్థాపన
- హాజరైన నేతలు, కార్యకర్తలు
నవతెలంగాణ బ్యూరో-హైరాబాద్
కష్టజీవుల పోరాట కేంద్రంగా సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం ఉండాలని పలువురు వక్తలు అభిలషించారు. హైదరాబాద్లోని రీసాల గడ్డలో ఇప్పటికే ఉన్న ఎన్వీ భాస్కర్రావు స్మారక భవనం స్థానంలో కొత్త భవనానికి ఆదివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు శంఖుస్థాపన చేశారు. ఇతర నేతలతో కలిసి శిలాపలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, కార్మికులతో పాటు శ్రమజీవులకు కేంద్రంగా తమ కార్యాలయం పనిచేస్తుందని చెప్పారు. భారీ వ్యయంతో కూడుకున్న భవన నిర్మాణానికి కార్మికులు, ఉద్యోగులు, శ్రేయోభిలాషులు, ప్రజాతంత్రవాదులు, వాణిజ్య-వ్యాపార వేత్తలు ఉదారంగా విరాళాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి సీఐటీయూ అనుబంధ సంఘాలు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సహకరించాలని కోరారు. ఏఐకేఎస్ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్మికులు, కర్షకులతో పాటు సమస్త ప్రజల సమస్యలను పట్టించుకునే కార్యాలయంగా సీఐటీయూ ఆఫీసు వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఐద్వా జాతీయ నాయకులు టి జ్యోతి మాట్లాడుతూ ప్రజా,కార్మిక ఉద్యమాల రూపకల్పనకు వేదిక కావాలన్నారు. సీఐటీయు పూర్వ ప్రధాన కార్యదర్శి ఆర్ సుధాభాస్కర్ మాట్లాడుతూ కార్మికోద్యమాలకు నాయకత్వం వహిస్తున్న సీఐటీయూ..నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టటం సముచితమేనన్నారు. కార్యక్రమంలో ఏఐఐఈఏ పూర్వ ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, ఏఐడీఈఎఫ్ జాయింట్ సెక్రటరీ జీటి గోపాల్రావు, సీజీ కాన్ఫడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె నాగేశ్వర్రావు, అజీజ్, ఎస్సీజెడ్ఐఈఎఫ్ జోనల్ జనరల్ సెక్రటరీ కె రవీంద్రనాథ్, ఎల్ఐసీ నాయకులు జి తిరుపతయ్య, జీఐసీ నాయకులు వై సుబ్బారావు, రైల్వే యూనియన్ నాయకులు శివకుమార్, పెన్షనర్స్ యూనియన్ నాయకులు ఎంఎన్రెడ్డి,ఐలు జాతీయ ఉపాధ్యక్షులు కె పార్థసారధి, పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు, సీఐటీయూ సీనియర్ నాయకులు పి రాజారావు, నవతెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ పి ప్రభాకర్, సీఐటీయూ ఆఫీసు బేరర్లు ఎస్ వీరయ్య, జె వెంకటేశ్, ఎస్వీ రమ, భూపాల్, పి జయలక్ష్మి, జె మల్లిఖార్జున్, కళ్యాణం వెంకటేశ్వరరావు,పద్మశ్రీ, వంగూరు రాములు, టి వీరారెడ్డి, జె చంద్రశేఖర్, బి మధు, బీరం మల్లేశ్,ముత్యం రావు, రాగుల రమేశ్, ఎం వెంకటేశ్, టి రాజారెడ్డి, పి శ్రీకాంత్, కూరపాటి రమేశ్,గోపాలస్వామితో పాటు వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, సీనియర్ నాయకులు పీఎస్ఎన్ మూర్తి, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.