Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశానికి ఉజ్వల భవిష్యత్ నిచ్చే బడ్జెట్ ను ప్రవేశపెట్టారంటూ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ .... కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను అభినందించారు. ఆదివారం న్యూఢిల్లీలో వారిరువురూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ పుదుచ్ఛేరి, తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను సీతారామన్‌కు సమర్పించారు.
సీఎంను కలిసిన నవీన్ మిట్టల్
భూపరిపాలనాశాఖ చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ)గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ ఆదివారం సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయిన ఆయన ధరణి, భూసమస్యలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ, పరిహారాలు తదితర అంశాలపై చర్చించారు. మరో వైపు రాచకొండ పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ దేవేంద్ర సింగ్ చౌహాన్ కూడా సీఎంను కలిశారు. త్వరలో జరగనున్న తన కుమార్తె వివాహానికి రావాలంటూ ఆయన సీఎంను ఆహ్వానించారు. మెదక్ జిల్లా శివంపేటలో నిర్మించిన శక్తిపీఠం, శ్రీ బగళాముఖి దేవాలయ ప్రతిష్టాపన మహౌత్సవానికి రావాలంటూ అక్కడి ట్రస్ట్ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ తదితరులు సీఎంను ఆహ్వానించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా ఆహ్వానించిన వారిలో ఉన్నారు.