Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉవ్వెత్తున లేస్తున్న భూ ఉద్యమం
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిరుపేదలు వేసుకున్న గుడిసెవాసుల పోరాటం మేడారం జాతరను తలపిస్తోంది. మేడారం జాతరను తలపిస్తోంది. జాతర మాదిరిగా గుడిసెలతోపాటు చిరు వ్యాపారాలు అధిక సంఖ్యలో వెలిశాయి. గుడిసె వాసుల నిమిత్తం టీ స్టాల్స్, భోజనం హౌటల్స్, పాన్‌షాప్‌లు, కిరాణా షాపులు, బొమ్మల షాపులు, దుకాణాలు ఏర్పాటు కావడంతో గుడిసెల ప్రాంతంలో నిత్యం వేలాది మందితో జాతరలా కోలాహలంగా కనబడుతోంది. మేడారం జాతరకు వెళ్లాల్సిన ప్రజలు ఆదివారం సెలవు దినం కావడంతో తమకు ఇంటి స్థలం రావాలని గుడిసెల ముందు ముగ్గులు వేసి, ఎదురు కోళ్లతో సమ్మక్క- సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. గుడిసెలో పాలు పొంగించి వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సామూహిక భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.