Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ రాజిరెడ్డి పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి రెండు శాతం నిధులను కేటాయించాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ కె.రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మొదటి వేతన సవరణ (1.4.2017), రెండో వేతన సవరణ (1.4.2021)పై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. ఆర్టీసీలో సంక్షేమ బోర్డులను తక్షణం రద్దు చేసి యూనియన్లకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశా రు. సీసీఎస్కు డబ్బులు చెల్లించాలనీ, పీఎఫ్, ఎస్ఆర్బీఎస్కు చెల్లించాల్సిన బ కాయిలను విడుదల చేయాలని కోరారు. కార్మికులపై పని భారం తగ్గించి, వేధిం పులను ఆపాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై మంగళవారం డిమాండ్స్ డేను నిర్వహించాలని ఆయన ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. సంబంధిత కార్డు లను ధరించి విధులు నిర్వహించాలనీ, నిరసనలు తెలపాలని తమ జేఏసీలో నిర్ణయించినట్టు వెల్లడించారు. జేఏసీ కన్వీనర్ వీ.ఎస్.రావు, కో కన్వీనర్ కత్తుల యాదయ్యతో కలిసి ఈ నిర్ణయాలను తీసుకున్నట్టు వివరించారు.