Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌలు రైతుల పరిస్థితి అధ్వాన్నం : వ్యవసాయరంగంపై కాంగ్రెస్ మూడో ఛార్జిషీట్ విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయాన్ని పండుగగా చేస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం...దాన్ని దండగగా మార్చిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వరరెడ్డి తెలిపారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు రైతు బంధు ఒక్కటే సర్వరోగ నివారిణి అన్నట్టుగా సర్కారు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో వ్యవసాయరంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై కాంగ్రెస్ మూడో ఛార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతురుణమాఫీని పూర్తిగా చేయకపోవడంతో రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రుణాలు అందకపోవడం, తగిన పెట్టుబడి రాకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారని విమర్శించారు. గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.