Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ జేఏసీ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఎస్ఆర్టీసీకి బడ్టెట్లో రూ. 6వేల కోట్లు కేటాయించాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. అదనంగా కొత్త బస్సులను కొనాలనీ, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తద్వారా సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం హైదరాబాద్లోని టీజేఎంయూ కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు టీజేఎంయూ, ఎస్డబ్ల్యూయూ, బీడబ్ల్యూయూ, కేపీ, కేఎస్ యూనియన్ల అధినేతలు కె హనుమంతు ముదిరాజ్, సుద్దాల సురేష్, జి అబ్రహం, బి. యాదగిరి, శివకుమార్, స్వాములయ్య, పీకే మూర్తి, బాలస్వామి, రాములు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ 2013 తర్వాత ఆర్టీసీలో వేతనాలు పెంచలేదన్నారు. రెండు వేతన సవరణలు, రెండు డీఏలు ఇవ్వాలని కోరారు. 50శాతం బాండ్ డబ్బుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పని భారం పెంచి వివిధ రకాల వేధింపులతో ఆర్టీసీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ... విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నారనీ, అటువంటి పద్ధతి వెంటనే మానుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు. ఆర్టీసీ సిబ్బంది స్వయంగా పొదుపు చేసుకున్న సీసీఎస్, పిఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ సుమారు రూ 3వేలకోట్లను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.