Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు సబిత, గంగుల, సత్యవతి రాథోడ్లకు స్పౌజ్ ఫోరం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 13 జిల్లాల ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితులు, మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ల స్పౌజ్ బదిలీలు చేపట్టాలని స్పౌజ్ ఫోరం సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్లకు, దారుసలేంలో ఎంఐఎం ఎమ్మెల్యేలకు ఆ ఫోరం సభ్యులు వినతిపత్రాలను అందజేశారు. గతేడాది 19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేసి 13 జిల్లాలను బ్లాక్లో పెట్టారని తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు. ఇటీవల 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను మాత్రమే చేపట్టారని తెలిపారు. 2100 దరఖాస్తులొస్తే కేవలం 30 శాతం మేరకే బదిలీలు చేపట్టారని చెప్పారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే సాకు చూపించి ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితుల బదిలీలను నిలిపేయడం అన్యాయమన్నారు. 80 నుంచి 90 శాతం వరకు ఇబ్బంది పడుతున్నది మహిళా ఉపాధ్యాయులేనని తెలిపారు.