Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్క్ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి
నవతెలంగాణ-బోధన్
యాసంగి సీజన్లో భాగంగా రైతులు పండించిన శనగ పంటను మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మెన్ మార గంగారెడ్డి తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్వహి స్తున్న బీఆర్ఎస్ మహాసభకు వెళుతూ నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతులు శనగ పంటలను పూర్తిగా ఎండబెట్టిన తర్వాత మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని కోరారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించి శనగలను కొనుగోలు చేస్తుంది కనుక ఎలాంటి ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్లు శరత్, గంగారెడ్డి, మాజీ మండల రైతు సమితి అధ్యక్షులు బుద్దె రాజేశ్వర్, ఏఎంసీ వైస్ చైర్మెన్ షకీల్ , వైస్ ఎంపీపీ గంగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు నరసయ్య, సర్పంచ్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.