Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే తొలి మొబిలిటీ ఫోకస్డ్ క్లస్టర్‌ను తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ రంగంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి రాబోయే ఐదేండ్లలో నాలుగు లక్షల ఉద్యోగా లను సృష్టించడం తమ లక్ష్యమని తెలిపారు. ఈ వ్యాలీ దేశంలో తయారీ, పరిశో ధన, అభివద్ధిలో సదుపాయాలు మెరుగుపరిచి రాష్ట్రాన్ని ఆకర్షణీయంగా మారు స్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు మెగా క్లస్ట ర్లను అభివృద్ధి చేస్తుందన్నారు. జహీరాబాద్‌తో పాటు సీతారాంపూర్‌లో ఈవీ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ క్లస్టర్, యెంకతల వద్ద ఇన్నోవేషన్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మరో రూ.మూడు వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయనీ, రెండు వారాల్లో వాటి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్ 3 వీలర్, ఎలక్ట్రిక్ 2 వీలర్, ఛార్జింగ్ పరికరాల తయారీ ఎకో సిస్టమ్ ను ఆయా సంస్థలు మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఏటీఎస్-టీయూవీ రైస్ ల్యాండ్ , బోష్ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ ఒప్పందం చేసుకున్నాయి. షెల్ తో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఈ కార్యక్రమంలో అపొలొ టైర్స్ లిమిటెడ్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ హిజ్మీ హాసెన్, వోక్స్ వ్యాగన్ గ్రూప్ ఇండియా, సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టియన్ కాహ్న వాన్ సీలెన్ తదితరులు పాల్గొన్నారు.