Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగునీటిశాఖకు నిధుల గండం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకు పోతున్నదని సోమవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్ రావు ప్రకటించారు. ప్రతి యేటా నిధులు కేటాయి స్తున్నా, ఖర్చు మాత్రం అంతంతగానే ఉంటున్నది. గతంలోని కేటాయిం పులు, ఖర్చు పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమ వుతున్నది. కాగా అప్పులు సైతం బాగానే మిగిలాయి. రాష్ట్రానికి ప్రస్తుతం సుమారు రూ. 3 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టు సమాచారం. దీనికి ప్రతియేటా దాదాపు రూ. 14 వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నది. ఇందులో 50 శాతం మేర సాగునీటి ప్రాజెక్టులకే వడ్డీకింద చెల్లిస్తున్నట్టు తెలిసింది.
1.50 లక్షల కోట్లు అవసరం .. కానీ ఇచ్చింది రూ. 26 వేల కోట్లే
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి భారీగా నిధులు అవసరమని ఇటు సాగునీటిశాఖ ఉన్నతాధికారులు, అటు సాగు నీటిరంగ నిపుణులు చెబుతున్నారు. వాటికి దాదాపు రూ. 1.50 లక్షల కోట్లు కావాల్సి ఉంటుందనీ, అప్పుడే చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయి సత్ఫలితాలు వస్తాయని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్లు అవసరం. ఇప్పటివరకు రూ. 40 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 40 వేల కోట్లు కావాల్సి ఉంటుంది. పాలమూరు - రంగారెడ్డికి లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా రూ. 80 వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ రూ. 20వేల కోట్లు పెట్టారు. ఇంకా రూ. 60 వేల కోట్లు తప్పనిసరిగా అవ సరమే. సీతారామసాగర్ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కావాలి. ఇకపోతే చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులకు మరో రూ. నాలుగు వేల కోట్లు అవసరమని అధికారుల చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకుగాను ప్రతియేటా ఏడు నుంచి తొమ్మిది శాతం మేర వడ్డీ చెల్లిస్తున్నది. అయితే తాజా బడ్జెట్లో సర్కారు ప్రాజెక్టులకు కేటాయించింది. మాత్రం రూ.26,885 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.
వచ్చే రెండేండ్లల్లో పూర్తికాకపోతే..
ఈ ప్రాజెక్టులు వచ్చే రెండేండ్లల్లో పూర్తి చేయకపోతే ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నాయని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. నిధులు విడుదల చేసి సకాలంలో పనులు ముగించకపోతే అంచనా వ్యయాలు మరింత పెరిగే పరిస్థితులు ఉత్పన్నమ వుతాయి. ఎస్ఎస్ఆర్ రేట్లూ పెరుగుతాయి.రీడిజైన్లు చేయడం సైతం వ్యయం పెరగడానికి కారణమవుతు న్నది. గతంలో ఒక్కో ప్రాజెక్టు పూర్తి కావడానికి 15 నుంచి 20 ఏండ్లు పట్టేది. దాంతో నిధుల అంచనాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పెంచాల్సి వచ్చింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టును రూ.155 కోట్లతో చేపట్టారు. నిర్మాణం ఆలస్యమై ఎస్ఎస్ఆర్ రేట్లు అంచనా వ్యయ మూ అధికమైంది. దీంతో ఆ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి రూ. 3500 కోట్లు ఖర్చయ్యాయి.
మళ్లీ అప్పులే
గతంలో కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సీతారామసాగర్ ప్రాజెక్టులకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు తేవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2020 మార్చి నాటికి రూ.63,541 కోట్లు కాగా, ఇందులో బడ్జెట్ నుంచి రూ.23,901.66 కోట్లు ఖర్చు చేశారు. కార్పొరేషన్ రుణాల ద్వారా రూ.39,640.04 కో ట్లు వ్యయం చేశారు.2020-21 అంచనా వ్యయం రూ.86 వేల కోట్ల నుంచి రూ.1,05,790.72 కోట్లకు పెంచారు. మరో రూ.17 వేల కోట్లు కార్పొరేషన్ల ద్వారా 2020 తర్వాత రుణాలు తేవడం జరిగింది.