Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు బీఆర్ఎస్కు పదిలం
- పార్టీకి, కేసీఆర్‌కు విధేయులమై పని చేద్దాం
- వారిని బహిష్కరించడం సబబే..
- వైరా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
నవతెలంగాణ-వైరా
ఖమ్మం జిల్లాలో వ్యక్తుల ఆధారంగా పార్టీలు ఉండవని, పార్టీల వల్లనే నాయకులు ఎదిగి పదవులు అనుభవించారని, అందుకు ఎంతో సహనం, విశ్వస నీయత ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాలో గాలి మారిందని కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో బీఆర్ఎస్ సుడిగాలి సృష్టించనున్నదని సృష్టం చేశారు. మంగళవారం ఖ మ్మం జిల్లా వైరా పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మం టపంలో ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు హౌరా హౌ రీగా పోరాడుకున్న చరిత్ర ఉందని, అటువంటి చైత న్యం కలిగిన జిల్లాలో వ్యక్తుల ఆధారంగా రాజకీ యాలు నడవవని పరోక్షంగా మాజీ ఎంపీ పొంగు లేటి శ్రీనివాసరెడ్డిపై విమర్శలు గుర్తించారు. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు, విద్యావేత్తలు వైరా గడ ్డపై నుంచి వచ్చారని, ఇక్కడ రైతాంగం కూడా ఎంతో చైతన్యవంతులని తెలిపారు. రాష్ట్ర సాధనలో మన పాత్ర లేకపోయినా, రాజకీయ పునరేకీకరణ కోసం ఎవరు ఎప్పుడు వచ్చినా పార్టీలో చేర్చుకున్నారని, ఎన్ని కుట్రలు జరిగినా ఎదిరించి రాష్ట్రాన్ని సాధించి నిలబెట్టిన దమ్ము కేసీఆర్‌దేనని అన్నారు. దేశంలో పుట్టిన ప్రాంతీయ పార్టీల్లో సుదీర్ఘ కాలం టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే ఉన్నాయని అందుకు అవి అనుసరించిన విధానాలు కారణమన్నారు. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్కు పదిలమని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పే వచ్చానని, వైరా నియోజక వర్గాన్ని గెలిపించే బాధ్యత తీసుకు న్నానని అన్నారు. తన అనుచరులను బహిష్కరిం చటం, పదవులను వదిలి వేయాలని డిమాండ్ చేస్తు న్నారని ఒక పెద్ద మనిషి వాపోతున్నాడని విమర్శిం చారు. జనవరి 18న ఖమ్మంలో జరిగిన సభలో వైరా నియోజకవర్గానికి రూ.30 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందేనన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్య క్షులు ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. నీవి ధన రాజకీయాలని, కుట్ర రాజకీయాలని, వెన్ను పోటు రాజకీయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. డీసీసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ.. వేదికపై ఉన్నవారిలో సగం మంది కాగితాలపై సంతకం చేసి మోసపో యిన వారిమేనన్నారు. సమావేశంలో రాష్ట్ర విత్తనాబివృద్ధి సంస్థ చైర్మెన్ కొండ బాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మెన్ లింగాల కమల్ రాజు ప్రసంగించారు. సమావేశంలో సూడా చైర్మెన్ బచ్చు రమణ, డీసీఎంఎస్ చైర్మెన్ రాయల శేషగిరిరావు, నియోజక వర్గంలోని జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, దిశా జిల్లా కమిటీ సభ్యులు, మునిసిపల్ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.